మిత్రుడు' చిత్రం బాలకృష్ణకు మళ్లీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్ వర్క్ లోనూ బాలకృష్ణ పాల్గొని ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ చిత్రం మెప్పిస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మళ్లీ ఆయన ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మరో కొత్త చిత్రానికి సన్నద్ధమవుతున్నారు. బాలకృష్ణ కథానాయకుడుగా యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్-4 చిత్రానికి బాలకృష్ణ కొత్తగా కమిట్ అయ్యారు. పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. పరుచూరి కిరిటీ ఇటీవల ఉదయ్ కిరణ్ హీరోగా 'గుండె ఝల్లుమంది' చిత్రాన్ని నిర్మించారు. అద్భుతమైన కథ, అత్యున్నత సాంకేతిక విలువలతో తమ కొత్త చిత్రం ఉంటుందనీ, బాలకృష్ణ ఇమేజ్ ను పెంచే విధంగా అత్యంత భారీ చిత్రంగా దీనిని రూపొందించనున్నామనీ నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఓ సెన్సేషన్ డెరెక్టర్ పనిచేస్తారని ఆయన తెలిపారు.
విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం ప్రకారం బాలకృష్ణ-పరుచూరి కీరిటీ కాంబినేషన్ చిత్రానికి బుగ్గిడి గోపాల్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. బి.గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్ లో గతంలో 'లారీ డ్రైవర్', 'సమర సింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఇటీవల కాలంలో ఈ కాంబినేషన్ పెద్దగా వర్కవుట్ కాలేదు. బి.గోపాల్ ఇటీవల రామ్ హీరోగా 'మస్కా' చిత్రానికి దర్శకత్వం వహించారు. గతం సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ సాధించి మళ్లీ బి.గోపాల్ ను నిలబెట్టింది. ఈ నేపథ్యంలో మళ్లీ బాలయ్యతో పనిచేసే అవకాశం బి.గోపాల్ ను వరించనట్టు చెబుతున్నారు. ఆగస్టులో బాలకృష్ణ కొత్త చిత్రం సెట్స్ పైకి వస్తుంది.
No comments:
Post a Comment